‘నాటు నాటు’ సాంగ్ కు బాలీవుడ్ హీరో కిర్రాక్ స్టెప్పులు..వీడియో వైరల్

0
94

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్.. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నాడు. అయితే ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కేసులు పెరగడంతో సినిమాను వాయిదా వేశారు మేకర్స్.ఇది ఇలా ఉండగా ఈ నెల 25వ తేదీన విడుద‌ల కాబోతున్నట్టు తెలిపారు చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ షురూ చేశారు మేకర్స్.

మొన్న దుబాయ్‌లో నిన్నకర్ణాటక చిక్‌బళ్లాపూర్‌లో RRR ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. నిన్న గుజరాత్‌లోని వడోదర (బరోడా)తో పాటు, ఢిల్లీలో  ఈ సినిమా ప్రచారం నిర్వహించారు. ఢిల్లీలోని ఇంపీరియల్ హోటల్ లాన్స్‌లో ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఓ ప్రమోషన్ కార్యక్రమాన్ని నిర్వహించింది.

ఈ కార్యక్రామానికి హిందీ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ చీఫ్ గెస్ట్‌గా వచ్చి చిత్ర యూనిట్‌ను అభినందించారు. అంతేకాదు ఈ వేడుకలో అమీర్ ఖాన్ నాటు నాటు హిందీ పాటకి స్టెప్పులు వేశారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్‌లు సైతం స్టెప్పులు వేస్తూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు.

వీడియో చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి

https://www.facebook.com/alltimereport/videos/333965045426055