బ్రేకింగ్: జగ్గారెడ్డిపై టీపీసీసీ వేటు

0
84

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి టీపీసీసీ వేటు వేసింది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న ఆయనను అదనపు బాధ్యతల నుండి తొలగించింది. ఖమ్మం, కరీంనగర్, భువనగిరి, ఎన్ఎస్ యుఐ, మహిళా కాంగ్రెస్,యూత్ కాంగ్రెస్ బాధ్యతలను మిగతా నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్ లకు టీపీసీసీ అప్పగించింది.

నిన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్లు అధిష్టానం హెచ్చిరికలను కూడా లేక్క చేయకుండా మర్రి శశిధర్ రెడ్డి అధ్యక్షతన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వీహెచ్, జగ్గారెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం జగ్గారెడ్డి టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డికి భజన చేసేవాళ్లు ఎక్కువ అయ్యారంటూ విమర్శించారు. నేను రాజీనామా చేస్తా.. నాపై కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ పెట్టి గెలిపించాలని సవాల్ చేశారు. ఈ వ్యాఖ్యల ఫలితంగానే జగ్గారెడ్డిని బాధ్యతల నుండి తొలగించారని తెలుస్తోంది.