ముంబై మెట్రోలో ఉద్యోగాలు..అప్లై చేయండిలా..

0
95

నిరుద్యోగులకు అలర్ట్..ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్‌ పలు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత ఉన్న వాళ్లు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు. దీని ద్వారా మొత్తం 27 పోస్టులను భర్తీ చేస్తున్నారు.

పోస్టుల వివరాలను చూస్తే..

5 అసిస్టెంట్ జనరల్ మేనేజర్

2 అసిస్టెంట్ మేనేజర్

2 డిప్యూటీ ఇంజనీర్

1 జూనియర్ సూపర్‌వైజర్

16 జూనియర్ ఇంజనీర్

అసిస్టెంట్ (IT) 1

అప్లై చేయండిలా..

ఈ పోస్టులకి అప్లై చెయ్యడానికి చివరి తేదీ 15 ఏప్రిల్ 2022. అప్లై చేసుకోవాలనుకునే వారు అధికారిక వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి అని తెలిపారు. ఇక ఇది ఇలా ఉంటే ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసాక అవసరమైన సమాచారాన్ని కూడా నింపాల్సి వుంది. అలానే అవసరమైన పత్రాలను జతచేయాలి. సెలెక్షన్ ప్రాసెస్ గురించి చూస్తే.. పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి ఇంటర్వ్యూకు పిలవడం జరుగుతుంది. అలా ఎంపిక చేస్తారు.

ఇక దరఖాస్తు ఎలా చేసుకోవాలి అనేది చూస్తే.. డిప్యూటీ జనరల్ మేనేజర్ (HR), ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్, MMRCL-లైన్ 3 ట్రాన్సిట్ ఆఫీస్, E. బ్లాక్, బాంద్రా కుర్లా కాంప్లెక్స్, బాంద్రా (తూర్పు) ముంబై-400051కి పంపించాలి. పూర్తి వివరాలను https://www.mmrcl.com/ లో చూడచ్చు