సామాన్యుల నెత్తిపై మరో భారం పడనుంది. ఇప్పటికే పెరిగిన నిత్యవసర సరుకుల ధరలతో నానా తంటాలు పడుతున్నారు. ఇది చాలదా అన్నట్టు సిలిండర్ ధరలు అమాంతం పెంచాయి చమురు సంస్థలు. దీనితో సామాన్యుల వంట మరింత కష్టతరం కానుంది. 14 కేజీల వంట గ్యాస్ ధర ఏకంగా రూ.50 పెరిగింది. ఇక తాజాగా పెరిగిన ధరలతో తెలంగాణ రాష్ట్రంలో సిలిండర్ ధర రూ.1002 కు చేరింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిలిండర్ల ధర 1008 రూపాయలకు చేరింది.