భీమ్లా నాయక్ ఓటిటి రిలీజ్ డేట్ చేంజ్..కారణం ఇదే!

0
106

పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ భీమ్లానాయక్’. పవన్ కళ్యాన్ స్టామినాను మరోసారి నిరూపిస్తూ.. భారీగా కలెక్షన్లను కొల్లగొడుతోంది. మళయాళ సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రిమేక్ గా వచ్చిన ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదలైంది. రానా, నిత్యామీనన్, సంయుక్త మీనన్ లీడ్ రోల్స్ వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది.

తాజాగా ఈ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్​ దక్కించుకున్న ‘ఆహా’ 25వ తేదీన బీమ్లానాయక్ రాబోతుందని ప్రకటించారు. కానీ తాజాగా ఈ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ ను మార్చారు. ఒకరోజు ముందుగానే అంటే 24నే ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

ఈ నెల 25వ తేదీన ఆర్ఆర్ఆర్ మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 24వ తేదీన “భీమ్లా నాయక్” ను విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. కాగా ఈ సినిమాకు సాగర్‌ కె.చంద్ర దర్శకుడు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందిస్తున్నారు.