టీఆర్‌ఎస్‌ నాయకులే భూస్వాములయ్యారు..తెరాసపై కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ ఫైర్

0
88

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ నిప్పులు చెరిగారు.పేదోళ్ల భూములని ప్రభుత్వమే కబ్జా చేయాలని చూస్తుంది. 2014 ఎన్నికలో దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తా అని హామీ ఇచ్చి తుంగలో తొక్కారని మండిపడ్డారు. అసెంబ్లీ వేదికగా కెసిఆర్ దళితులకు మూడు ఎకరాలు భూమి ఇస్తామని చెప్పలేదు అని అబద్దాలు మాట్లాడుతున్నారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చాక పేదోళ్ళు భూస్వాములు కాలేదు. టీఆర్ఎస్ వాళ్లు భూస్వాములు అయ్యారు. టీఆర్ఎస్ నాయకులు బ్లాక్ మెయిలర్స్ గా మారారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన భూముల్ని ప్రభుత్వం గుచ్చుకుంటుంది. గత ప్రభుత్వాలు 25 లక్షల భూముల్ని ఇస్తే ఈ ప్రభుత్వం అ భూముల్ని గుంజుకుంది. ఇందిరా గాంధీ, పివి నర్సింహారావు లాంటి వాళ్ళు పేదలకు భూ సంస్కరణలు చేసి భూములు పంచారు.

పేదల భూముల తీసుకొని ప్రభుత్వం భూ దందా చేస్తుంది. భూములు ఇవ్వకపోగా దళితుల భూములు గుంజుకుంటున్నారు. ఆదాయం కోసం ప్రభుత్వం పేదల భూముల్ని తీసుకుంటూ పేదలకి మందు తాగిస్తుంది. తెలంగాణ రాష్ట్రలో భూ దందా జరుగుతుంది. భూ దందా మాని.. పరిపాలన చేయండని దాసోజు శ్రవణ్ చురకలు అంటించారు.