ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ బీజేపీకి ఓ సవాల్ విసిరారు. ఆ సవాల్ ను స్వీకరించి బీజేపీ గెలిస్తే మాత్రం తమ ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయాలకు పూర్తి దూరంగా ఉంటుందని సవాల్ విసిరారు. ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎంసీడీ ఎన్నికలను బీజేపీ సకాలంలో నిర్వహించి గెలవాలని కండీషన్ పెట్టారు. ఢిల్లీలో ఉత్తర, తూర్పు, దక్షిణాది అనే మూడు స్ధానిక సంస్ధల్ని ఏకం చేసే బిల్లుకు నిన్న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన నేపథ్యంలో కేజ్రివాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.