JUST MISS: వెంట్రుక‌వాసిలో చావు నుంచి త‌ప్పించుకున్న బాలుడు..వీడియో వైరల్

0
92

కొన్ని కొన్ని ప్రమాదాలను చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రమాదాలు ఎప్పుడు ఎక్కడినుంచి వస్తాయో చెప్పలేం. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

యాక్సిడెంట్ నుంచి ఓ బాలుడు వెంట్రుకవాసిలో చావు నుంచి తప్పించుకున్నాడు. రోడ్డుపై బస్సు వెళ్తుండగా..దాన్ని ఓవర్టేక్ చేస్తూ బైకర్ దూసుకొచ్చాడు. అప్పుడే ఓ బాలుడు సైకిల్ పై రోడ్డుపైకి రాగా.. బైకర్ అతన్ని బలంగా ఢీకొట్టడంతో బాలుడు ఎగిరి రోడ్డు అవతలి వైపు పడ్డాడు. వెనకాలే వస్తున్న బస్సు అతడి సైకిల్ పైకి ఎక్కేసింది.

ఈ ప్రమాదంలో బాలుడు సురక్షితంగా బయటపడగా..ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఇప్పుడు సోషల్ మీడియాలో  వైరల్‌గా మారింది. కాగా మార్చి 20న కేరళలోని కన్నూరు తాలిపరంబ చోరుక్కలలో ఈ యాక్సిడెంట్ జరిగింది.

వీడియో చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి

https://www.facebook.com/alltimereport/videos/390202032943010