ప్రస్తుతం సినిమా పాటలతో సమానంగా ఫోక్ సాంగ్స్ వ్యూస్ ను కొల్లగొడుతున్నాయి. దీనితో యూట్యూబ్ లో ఈ సాంగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. కొన్ని ఫోక్ సాంగ్స్ సినిమాలో కూడా వాడారు. అంతలా వాటికీ ప్రాధాన్యత పెరిగింది. తాజాగా ఓ ఫోక్ సాంగ్ విపరీతమైన ఆదరణ పొందింది.
ఈ పాటను సై టివి పల్లె పాటల పండుగ వారు రూపొందించారు. చెక్కేరెంత బుక్కిన చేదుగున్నదవ్వొ..పిడికెడంత ఉప్పు తిన్న సప్పగున్నదవ్వ అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటుంది. కాగా ఈ పాటను సింగర్ లక్ష్మి పాడగా రఘు జాన్ కోరియోగ్రఫీ చేశారు. అలాగే డైరెక్షన్, మ్యూజిక్, లిరిసిస్ట్ గా తిరుపతి తెరకెక్కించగా అఖిల, టోనీ కిక్ నటించారు.
వీడియో సాంగ్ చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి