ప్రతి సీజన్ కు ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆయా కాలాల్లో లభించే పండ్లకు భలే గిరాకి ఉంటుంది. వేసవి వచ్చిందంటే చాలు రకాల రకాల మామిడి పండ్ల రుచి నోరూరుతుంది. పల్లెటూల్లో అయితే బస్తాల కొద్ది మామిడికాయలు తెచ్చుకొని మగ్గబెడుతారు. వేసవిలో మాత్రమే దొరికే ఈ పండ్లను ఎవ్వరూ మిస్ అవ్వరు. పండ్లలో రారాజుగా చెప్పుకునే మామిడి ఆరోగ్యాన్ని ఇవ్వడంలోనూ రారాజే. మరి దాని ఉపయోగాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
అయితే సాధారణంగా ఏ సీజన్లలో లభించే పండ్లను తీసుకోవడం ద్వారా ఆ సీజన్‌లో ఏర్పడే అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చునని న్యూట్రీషన్లు అంటున్నారు. వేసవిలో దొరికే మామిడి, పుచ్చకాయ వంటి వాటిల్లో ఖనిజ లవణాలు అధికంగా ఉంటాయని.. ఇవి వడదెబ్బ తగలకుండా శరీరానికి శక్తినిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
మామిడి పండ్లు కేవలం రుచి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగపడతాయి.ఇందులో విటమిన్స్ సమృద్ధిగా ఉంటాయి. అలానే బాగా జీర్ణం అవ్వడానికి ఎంతో ఉపయోగపడుతాయి. అయితే వేసవి కాలం లో సరైన సమయంలో మామిడి పండ్లు తీసుకోవడం కూడా చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
మీకు కనుక డయాబెటిస్ ఉన్నట్లయితే మామిడి పండ్లు తినడానికి అసలు భయపడకండి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. ఈ రోజుల్లో ఎక్కువమందిని భయపెడుతున్న క్యాన్సర్లకు అడ్డుకట్ట వేసే గుణం మామిడికి ఉంది. కొలోన్, బ్రెస్ట్, ప్రొస్టేట్ క్యాన్సర్లను వీలైనంత వరకు మామిడి అరికడుతుంది. వీటితోపాటు కొవ్వును తగ్గించగలిగే మరో మంచి గుణం ఈ పండులో ఉంది.