ఏపీలో కరోనా మహమ్మారి పీడ దాదాపు విరగడయింది. గడిచిన 24 గంటలలో రాష్ట్ర వ్యాప్తంగా 10,502 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..41 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. గడిచిన 24 గంటల్లో ఎటువంటి మరణాలు సంభవించలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా వైరస్ వల్ల 14,730 మంది బాధితులు మృతి చెందారు. అలాగే గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ నుంచి 75 మంది బాధితులు పూర్తిగా కోలుకున్నారు. దీంతో రాష్ట్ర ప్రస్తుతం 395 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి.
గడిచిన 24 గంటల్లో జిల్లాల వారిగా కేసులు ఈ విధంగా ఉన్నాయి.
అనంతపురం 15
చిత్తూరు 3
ఈస్ట్ గోదావరి 10
గుంటూరు 1
వైస్సార్ కడప 1
కృష్ణ 1
కర్నూల్ 0
నెల్లూరు 1
ప్రకాశం 1
శ్రీకాకుళం 2
విశాఖపట్నం 5
విజయనగరం 0
వెస్ట్ గోదావరి 1