సొంత ఇలాకాలో సిఎం కేసిఆర్ కు షాక్ తగిలింది. సీఎం కేసీఆర్ నియోజకవర్గం అయిన గజ్వెల్ టిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి ఇంటివద్ద ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి, వర్గల్ మండలం నెంటూర్ గ్రామాలకు చెందిన వందలాది మంది టిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లో చేరారు. ఈ కార్యక్రమంలో వాళ్లందరికీ రేవంత్ రెడ్డి కండువాలు కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు.