ఫ్యాన్స్ కు పూనకాలే..కెజిఎఫ్ 2 ట్రైలర్ వచ్చేసింది (వీడియో)

0
89

రాకింగ్ స్టార్ యష్ నటించిన తాజా చిత్రం కెజిఎఫ్ 2. ఇప్పటికే సినీ ప్రపంచంలో ఓ ట్రెండ్‌ సెట్‌ చేసింది కేజీఎప్‌ -1. ఇప్పుడు కెజిఎఫ్ చాఫ్టర్ 2 గా తెరకెక్కుతుంది. కాగా ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టింది చిత్ర యూనిట్.

తాజాగా ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. తెలుగులో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్.. కేజీఎఫ్-2 ట్రైల‌ర్ ను విడుద‌ల చేశారు. ట్రైల‌ర్ లో రాఖీ బాయ్ ని చూస్తే.. ఫ్యాన్స్ కు గుస్బామ్స్ రావ‌డం ఖాయం.

ట్రైల‌ర్ లో య‌శ్ మాస్ తో పాటు క్లాస్ లుక్ తో ఆక‌ట్టుకుంటున్నాడు. ట్రైల‌ర్ తో కేజీఎఫ్-2 పై అంచ‌నాలు భారీగా పెరిగిపోయాయి. కేజీఎఫ్-2 కు రూ. 100 కోట్ల భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కించారు. కేజీఎఫ్ చాప్ట‌ర్ 1 సినిమా 2018 లో విడుద‌ల అయి సూపర్ హిట్ అయింది. అందుకే కెజిఎఫ్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ట్రైలర్ చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి

https://www.youtube.com/watch?v=bDTUFufX-1s&feature=emb_title