మీ చేతులు వణుకుతున్నాయా..అయితే కారణం ఇదే కావొచ్చు!

0
91

మాట్లాడేప్పుడు లేదా ఏదైనా పని చేసేప్పుడు చాలా మందికి  చేతులు వణుకుతున్నట్లు మీరు గమనించే ఉంటారు. ఏదైనా టెన్షన్‌లో ఉన్నప్పుడు కూడా చేతులు వణుకుతాయి. ముఖ్యంగా చేతి వేళ్లు అధికంగా వణుకుతాయి. ఇలాంటి సమస్యలకు ప్రధాన కారణం జీవనశైలి, అధిక ఒత్తిడి, ఆహారపు అలవాట్లే కారణం అంటున్నారు నిపుణులు.

అయితే చేతులు ఎందుకు వణుకుతాయనే దానికి మాత్రం సరైన కారణం ఇంకా తెలియదు. కానీ, శరీరంలోని కొన్ని నాడుల పనితీరు కారణంగానూ ఈ సమస్య ఎదురుకావొచ్చని కొందరు వైద్యులు చెబుతున్నారు. అయితే చేతుల్లో వణుకును తగ్గించుకునేందుకు కొన్ని వ్యాయామాలు చేయాలని వైదులు సూచిస్తున్నారు.

హ్యాండ్ డంబెల్ వ్యాయామం కూడా ఈ సమస్య నుంచి బయట పడేందుకు మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వ్యాయామం చేతుల్లోని వణుకు తగ్గించే అవకాశం ఉంది. ఈ వ్యాయామం పార్కిన్సన్స్ రోగులు కూడా చేస్తారు. ఎందుకంటే ఇది నరాల అలసట, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.

ఫింగర్ ట్యాప్ వ్యాయామంతో మీకు ఉపశమనం లభిస్తుంది. ఈ వ్యాయామం ద్వారా మీ చేతి వేళ్లు కదలికలను నియంత్రించాలి. ఫింగర్ ట్యాప్ వ్యాయామం అనేది ఒక సాధారణ వ్యాయామం.. ఇది మీ చేతి వేళ్ల కదలికపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన విషయం.రబ్బర్ లేదా స్పాంజ్ బాల్ వ్యాయామం వల్ల చేతి వణుకు సమస్య నుంచి బయటపడవచ్చు.

చేతులు వణుకడాన్ని నియంత్రించడంలో ఈ వ్యాయామం చాలా ఉపయోగకరంగా ఉంటుందని వైద్యులు నమ్ముతారు. ఎందుకంటే బంతిని నొక్కడం వల్ల నరాల పనితీరు మెరుగవుతుందని వారి నమ్మకం. బంతిని వీలైనంత గట్టిగా ఒత్తడం సహా గట్టిగా పిసికేసే విధంగా ప్రయత్నించాలి. ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా మీలో చేతులు వణికే సమస్య తగ్గుముఖం పడుతుంది.