11 రోజులు భక్తుల పూజలు అందుకున్న బొజ్జ గణపయ్యలు నిమజ్జనానికి సిద్ధమయ్యారు హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి ప్రారంభమైన గణేష్ శోభ యాత్ర లన్ని ట్యాంక్ బండ్ దారి పట్టాయి ఖైరతాబాద్ గణపతి కూడా గంగా ఒడిలోకి చేరడానికి పయనమయ్యాడు. గతరాత్రి పూజలందుకున్న శ్రీ ద్వాదశ ఆదిత్య మహాగణపతిని క్రేన్ సహాయంతో ట్రాక్ పైకి ఎక్కించి శోభాయాత్ర ప్రారంభించారు.
హైదరాబాద్లో జరిగే మొదటి నిమజ్జనం ఈ మహా గణపతిదే అని నిర్వాహకులు తెలిపారు. ఉదయం 11 గంటలకే ఎన్టీఆర్ మార్గ్ లోని ఆరో నెంబర్ క్రేన్ దగ్గర కు గణపతి చేరుకుంటారని ఒంటిగంట లోపలే ఈ నిమజ్జనం పూర్తి చేయనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. క్రేన్ వద్ద లోతును ఇరవై అడుగులకు పైగా పెంచినట్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు తెలిపారు.