కోమటిరెడ్డికి సర్కార్ షాక్..కాంగ్రెస్ సీరియస్

0
91

యాదాద్రి పున: ప్రారంభం రాజకీయ రచ్చకు దారి తీసింది. ఈరోజు కేసీఆర్ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ ఆలయాన్ని పున:ప్రారంభించారు. అంగరంగ వైభవంగా నూతనంగా నిర్మించిన ఆలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ ఆలయ ప్రారంభానికి సతీసమేతంగా కేసీఆర్ హాజరయ్యారు. కేసీఆర్ తో పాటు మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

యాదాద్రి పునర్ ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పిలవకపోవడం ఇప్పుడు రాజకీయ రచ్చకు దారి తీసింది. ఈరోజు కేసీఆర్ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ ఆలయాన్ని పున:ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు హాజరయ్యారు. అయితే స్థానిక ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని పిలవకపోవడం నీచపు రాజకీయమని ఆలేరు ఎంపీపీ గంధమల్ల అశోక్ సీరియస్ అయ్యారు.

స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ..నాలుగుసార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా తెలంగాణ రాష్ట్రం కోసం తన మంత్రి పదవిని త్యాగం చేసిన వ్యక్తి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. అలాంటి వ్యక్తిని ప్రోటోకాల్ పాటించకుండా పిలవకుండా దేవస్థానం దగ్గర రాజకీయాలు చేయడం దారుణం అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వర రాజు, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బత్తుల నరేందర్రెడ్డి, రాఘవపురం ఎంపిటిసి ప్రశాంత్, గాజుల వెంకటేష్, బాకీ రాములు తదితరులు పాల్గొన్నారు.