ట్రూకాలర్​లో మీ పేరు మార్చుకోవాలా? అయితే ఇలా చేయండి

0
96

మామూలుగా మనకు కొత్త నెంబర్ నుండి ఫోన్ వస్తే ఎవరిదో తెలుసుకోవాలని తాపత్రయపడుతుంటాం. మరి తెలియని​ వ్యక్తులు కాల్​ చేసినప్పుడు వారి వివరాలను తెలియజేస్తుంది ట్రూ కాలర్​. అందుకే ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన కాలర్​ ఐడీ యాప్ గా నిలిచింది. ఫోన్​ రింగ్​ అవడానికి ముందే ఎవరు కాల్​ చేస్తున్నారో చెప్పేస్తుంది​.

అయితే కొన్నిసార్లు కాలర్​ పేరును తప్పుగా, ఇబ్బంది కలిగించేలా చూపిస్తుంటుంది. ఇలా మీకు జరిగి ఉంటే.. సరైన చోటుకే వచ్చారు. ఎందుకంటే ఆండ్రాయిడ్, ఐఫోన్​ సహా వెబ్​సైట్​లలో ట్రూకాలర్​లో మీ పేరును కూడా మార్చుకోవచ్చు.

అదెలాగంటే?

ట్రూ కాలర్​ యాప్​ ఓపెన్​ చేసి.. ఎడమవైపు పై భాగంలో ఉండే ‘హ్యాంబర్గర్​ మెనూ’పై (మూడు అడ్డ గీతలు) నొక్కాలి. అప్పుడు.. మీ పేరు పక్కన ఉండే ‘ఎడిట్’ బటన్​పై (పెన్సిల్ ఐకాన్) క్లిక్ చేయాలి.

ఆ తర్వాతి పేజ్​లో ట్రూ కాలర్​లో ఇతరులకు మీ పేరు ఏ విధంగా కనిపించాలని అనుకుంటున్నారో.. ఆ పేరు టైప్ చేసి ‘సేవ్’ చేయండి.

ఇలా చేస్తే సాధారణంగా మీ పేరు వెంటనే మారుతుంది. అయితే అందుకు 24 నుంచి 48 గంటల వరకు సమయం పట్టొచ్చని ట్రూకాలర్​ చెబుతుంది.