మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పాఠశాల నుంచి తిరిగి వస్తుండగా.. జిల్లాలోని దేవాస్ రోడ్డులో ఛందేసర గ్రామ సమీపంలో స్కూల్ వాహనం చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా..19 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. కాగా ప్రమాద సమయంలో వ్యాన్ లో 21 మంది పిల్లలు ఉన్నట్లు తెలుస్తుంది.