ఉద్యోగం కోసం చూసే వారికీ చక్కని శుభవార్త. సీఎస్ఐఆర్-నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ లో కొన్ని ఖాళీలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. సీఎస్ఐఆర్-నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీలో ప్రాజెక్ట్ అసోసియేట్-I, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్ – II పోస్టులు వున్నాయి.
భర్తీ చేయనున్న ఖాళీలు: 9
అర్హులు ఎవరంటే
35 నుంచి 40 ఏళ్ల ఉండాలి
డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
నెట్/గేట్ లో అర్హత ఉండాలి
జీతం
నెలకు రూ. 25,000ల నుంచి రూ.42,000
ఇక ఇది ఇలా ఉంటే పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్ లో మాస్టర్స్ డిగ్రీ ని పూర్తి చేసి ఉండాలి.
అలాగే నెట్/గేట్ లో అర్హత ఉండాలి అని నోటిఫికేషన్ ద్వారా తెలిపారు. అంతే కాకుండా సంబంధిత విభాగం లో పని అనుభవం కూడా ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్ గురించి చూస్తే.. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 5, 2022. ఎలా అప్లై చేసుకోవాలి అనేది చూస్తే ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలను https://www.ncl-india.org/ లో చూడచ్చు.