ఎమ్మెల్సీ కవిత ట్వీట్ కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కౌంటర్ ట్వీట్

0
98

తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం సేకరణ అంశంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ట్విటర్‌లో స్పందించారు. ధాన్యం పూర్తిగా కొనేవరకు రాష్ట్ర రైతుల తరఫున పోరాటం చేస్తామని వెల్లడించారు.  ఈ ట్వీట్ పై ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీ గారు, రాజకీయ లబ్ది కోసం నామమాత్రంగా ట్విట్టర్ లో సంఘీభావం తెలుపడం కాదు.

టిఆర్ఎస్ పార్టీ ఎంపీలు ప్రతిరోజు పార్లమెంట్ వెల్ లోకి వెళ్లి తమ నిరసన తెలియజేస్తున్నారన్నారు ఎమ్మెల్సీ కవిత. మీకు నిజాయితీ ఉంటే తెలంగాణ ఎంపీలకు మద్దతుగా వెల్ లోకి వచ్చి నిరసన తెలియజేయాలని కవిత అన్నారు. ఒక దేశం ఒకే సేక‌ర‌ణ విధానం కోసం డిమాండ్ చేయాలని రాహుల్ గాంధీకి ఎమ్మెల్సీ కవిత సూచించారు.

ఇక తాజాగా ఎమ్మెల్సీ కవిత ట్వీట్ కి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కౌంటర్ ట్వీట్ ఇచ్చారు. టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో పోరాడటం లేదు. సెంట్రల్ హాల్లో కాలక్షేపం చేస్తున్నారు. ఇకపై ఎఫ్ సీఐకి బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని మీ తండ్రి కేసీఆర్ గత ఆగస్టులోనే ఒప్పందంపై సంతకం చేశారు.మీ తండ్రి నాడు చేసిన సంతకం నేడు తెలంగాణ రైతుల మెడకు ఉరితాడైంది. ఈ వాస్తవాన్ని మీరు మర్చిపోయారంటూ చురకలు అంటించారు.