తాగుబోతుల తెలంగాణగా మార్చారు..టీఆర్ఎస్ సర్కార్ పై ఈటెల ఫైర్

0
80

టీఆర్ఎస్ సర్కార్ పై హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మండిపడ్డారు. ఈ రాష్ట్రం అణగారిన వర్గాలకు నిలయం. నా ఆరాటం వారి కోసమే అని చెప్పిన కేసీఆర్, ఎస్సి, బిసిల జీవితాల్లో మార్పుతేని రాష్ట్రం తెలంగాణగా మార్చారు. తాగుబోతులను తయారు చేయటంలో నెంబర్ వన్ గా నిలిపారు. నిజాం కాలం నాటి భూములు అమ్ముకొని సోకులు చేస్తున్నావు కేసీఆర్ అంటూ నిప్పులు చెరిగారు.

నాడు 10 వేల ఆదాయం లేని లిక్కర్, నేడు 31 వేల కోట్ల ఆదాయానికి తీసుకెళ్లారు. ఇందులోనా నెంబర్ వన్. అడబిడ్డల మాంగల్యాలను దూరం చేస్తున్నారు.. లక్షల మంది పిల్లలు ఆనాధలుగా మారుతున్నారు. 52 శాతం ఉన్న బీసీలకు ఎన్ని నిధులు ఖర్చు చేశారో చెప్పగలరా?. నిధుల కేటాయింపు ఉంటుంది కానీ ఖర్చు చేయడానికి చేతులు రావంటూ ఫైర్ అయ్యారు. నీ మాటలకు చేతలకు పొంతన లేదని, ప్రజలు గ్రహించారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నీ సర్కారు కూలిపోవడం ఖాయం.

పీకేని సిద్దిపేటలో తింపితే ఓట్లు వస్తాయా ? హుజురాబాద్ లో పీకే వ్యూహాలు ఏమయ్యాయి.
హుజురాబాద్ లో 600 కోట్ల మద్యం పారించారు.. ఓటుకి 10 వేలు ఇచ్చారు.. ఈ దుర్మార్గులకు నాయకత్వం వహించింది హరీశ్ రావు. రాజకీయాలను డబ్బుతో కలుషితం చేసి సాదారణ ప్రజలకు, సామాన్యునికి రాజకీయ పదవులను దూరం చేసిన దుర్మార్గులు వీరు. దేశంలోనే వేల కోట్లు పంచి ప్రజాతీర్పును వంచించెందుకు కుట్రలు చేసిన పార్టీ టిఆర్ ఎస్.

ధర్మం, న్యాయం నిజమే అయితే ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చినవో చెప్పగలవా. తీసుకునే దగ్గర తీసుకో.. ఏసుకునే దగ్గర ఏసుకో అని చెప్పింది కేసీఆర్.. ఇప్పుడు ఆయన మాటలు ఆయనకే అప్ప చెప్పాలి. 24 గంటల కరెంట్ నిజమే అయితే.. రాత్రి పూట బాయిల దగ్గర కరెంట్ ఉంటుందా ? 24 గంటల కరెంట్ ఇచ్చే దమ్ము కేసీఆర్ కు లేదు. 10 లక్షలు దళితబందు ఎక్కడా రావడం లేదు. వందో, రెండు వందల మందికో ఇస్తుండొచ్చు.. మిగితావారి కండ్లలో కారం కొడతారు. తెలంగాణ ప్రజలు ఏవీ మరవరు.. సమయం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెడతారు

ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కేసీఆర్ డబ్బు సంచులు గుంజుకోవాల్సిందే.. ఓటు మాత్రం ధర్మానికి వేయాలి. టిఆర్ ఎస్ ఉన్నంత వరకు ఆ పార్టీలో ఇతరులు ఎవరైన సీఎం అవుతారా, ఆ పార్టీ అధ్యక్షుడు అయితాడా? బీజేపీలో అతి సాదారణ వ్యక్తి కూడా ఉన్నత పదవులు వస్తాయి.. చాయ్ అమ్ముకునే సాదారణ వ్యక్తి మోడీని ప్రధానిని చేసిన ఘనత బీజేపీది. పార్టీలో ఎదిగితే అణచివేస్తాడు కెసిఆర్. ఇయ్యల నేను కావచ్చు.. రేపు నువ్వూ కావచ్చు.. నాకు చెప్పుకునే దమ్ము ఉంది. నీకా దమ్ము లేదు. మేం ఉద్యమం నడిపితేనే పార్టీ నిలబడ్డది. అధికారంలోకి వచ్చారు. మీ ఆటలు మోసపు మాటలు ఇక చెల్లవు.. తెలంగాణ పల్లెల్లో అశాంతి నెలకొన్నది. టిఆర్ ఎస్ కూలితేనే శాంతి నెలకొంటది.