2022-23 ఫైనాన్స్ బిల్లుకు రాజ్యస‌భ ఆమోదం

0
79

కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ కు సంబంధించిన ఫైనాన్స్ బిల్లును నేడు రాజ్యస‌భ ఆమోదం తెలిపింది. ఫైనాన్స్ బిల్లు.. ఇటీవ‌ల లోక్ స‌భ‌లో ఆమోదం పొందింది. తాజాగా ఈ రోజు ఫైనాన్స్ బిల్లు, కేటాయింపుల బిల్లులు ఆమోదం కోసం రాజ్య స‌భ ముందుకు వ‌చ్చాయి. దీంతో రాజ్యస‌భ స‌భ్యులు వాయిస్ ఓటింగ్ ప‌ద్ద‌తి ద్వారా.. ఫైనాన్స్ బిల్లు, కేటాయింపుల బిల్ల‌లకు ఆమోదం తెలిపారు.