బాలీవుడ్ లో ఎన్నో సినిమాలు చేసి సూపర్ హిట్స్ అందుకున్న శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ రెండు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు.
ఇప్పటికే లైగర్ మూవీ షూటింగ్ పూర్తయ్యి, ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది చిత్రబృందం.ఈ సినిమాను ఆగస్టు 25న విడుదల చేయటానికి ముహూర్తం ఫిక్స్ చేసారు చిత్ర యూనిట్.తాజాగా JGM మూవీని అధికారికంగా ఎనౌన్స్ చేసి టైటిల్ పోస్టర్ను కూడా విడుదల చేసాడు పూరి. తాజాగా తీస్తున్న సినిమాలో విజయ్ ను సోల్జర్ గెటప్ లో చూపిస్తున్నాడు పూరి.
అయితే ఇది పాన్ ఇండియా మూవీ కావడంతో బాలీవుడ్ హీరోయిన్ ను పెట్టాలనే ఆలోచిస్తున్నాడట పూరి. ఈ మేరకు శ్రీదేవి గారి కూతురు జాన్వీ కపూర్ ను ఈ సినిమాలో హీరోయిన్ గా చేయమని ఆమెతో చిత్రబృందం చర్చలు జరుపుతున్నారట. కానీ ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకు ఆగాల్సిందే..