ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన తరువాత సజ్జనార్ తన మార్క్ చూపిస్తున్నారు. ఇప్పటికే చాలా ఆఫర్లు, వినూత్నమైన నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ ఆర్టీసీని ఎలాగైనా లాభాల బాటలో ఉంచాలని అహర్నిశలు కష్టపడుతున్నారు. తాజాగా ఉగాది సందర్బంగా ప్రయాణికులకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది టీఎస్ ఆర్టీసీ.
ఏప్రిల్ 2న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 65 ఏళ్లకు పైబడిన వాళ్ళకు బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఈ ఆఫర్ కేవలం ఏప్రిల్ రెండో తేదీ ఉగాది పండుగ సందర్భంగా మాత్రమే అని తెలిపారు. బస్సుల్లో ప్రయాణించేటపుడు తమ దగ్గర ఉన్న గుర్తింపు కార్డును కండక్టర్‌కు చూపించి ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచుకోవచ్చని సజ్జనార్ తెలిపారు.