ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఉగాది పండుగ సెలవుల రద్దీ దృష్ట్యా పలు రూట్లలో 5 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
రైళ్ల వివరాలు ఇలా..
సికింద్రాబాద్-తిరుపతి (నం:07597) రైలు ఏప్రిల్ 1న రాత్రి 8.15కి బయల్దేరుతుంది.
మచిలీపట్నం-తిరుపతి (నం:07095) 1న సా.6.25 గంటలకు,
తిరుపతి-కాకినాడ (నం:07598) 2న రాత్రి 9.55కు,
కాకినాడ-వికారాబాద్ (నం:07599) 3న రాత్రి 8.45కు,
తిరుపతి-మచిలీపట్నం (నం:07096) 2న రాత్రి 10.15కు బయల్దేరుతుందని తెలిపారు.