భానుడు నిప్పులు కుమ్మరించడంతో ఎండల నుండి ఉపశమనం పొందడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిన పెద్దగా ఫలితం లభించడం లేదు. ఎండ వేడిని తట్టుకోవాలంటే కొన్ని ఆహార పదార్థాలు కనుక మన డైట్ లో తీసుకుంటే మనకు చక్కగా సహాయం చేస్తాయి. అయితే మరి ఆలస్యం లేకుండా వెంటనే చూసేద్దాం..
కొబ్బరి నీళ్ళు: కొబ్బరి నీళ్ళు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో విటమిన్స్, ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. వేసవి కాలంలో కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.
పుచ్చకాయ: పుచ్చకాయలో నీటిశాతం అధికంగా ఉంటుంది. పుచ్చకాయ తినడం వల్ల క్యాన్సర్, హైబీపీ, హృదయ సంబంధిత సమస్యలు చెక్ పెట్టొచ్చ. బరువు తగ్గడానికి కూడా పుచ్చకాయ సహాయపడుతుంది.
టమాటా: టమాటా కూడా వేసవికాలంలో బాగా పనిచేస్తుంది. టమాటా వల్ల చాలా లాభాలు పొందవచ్చు. కాబట్టి వేసవిలో దీనిని తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.