సమంతా షూటింగ్ కి రెడీ

సమంతా షూటింగ్ కి రెడీ

0
77

అక్కినేని సమంత పెళ్లి తర్వాత కమర్షియల్ సినిమాలో గ్లామర్ హీరోయిన్ గా కాకుండా సరికొత్త కథలను ఎన్నుకుని కెరీర్ పరంగా దూసుకుపోతోంది. నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఓ బేబీ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది సమంత .

ఆ తర్వాత సమంత ప్రధాన పాత్ర పోషిస్తున్న 96 తెలుగు రీమేక్ తాజా షెడ్యూల్ షూటింగ్ ఈనెల 16 నుంచి జరుగుతోంది. తమిళ దర్శకుడు ప్రవీణ్ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు తమిళ బ్లాక్ బస్టర్ మూవీ హిట్ 96 చిత్రంలో సామ్ శర్వానంద్ తో జోడీ కట్టనుంది.

ఈ చిత్రానికి జాను లేదా జానకీదేవి అనే రెండు టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. ఇందులో శర్వానంద్ కెమెరామెన్ గా కనిపించనున్నాడు. అక్టోబర్ లేదా నవంబర్ మొదటి వారంలో సినిమా షూటింగ్ పూర్తి కానుంది అంటున్నారు.