“కొత్త రంగుల ప్రపంచం” ఫస్ట్ లుక్ విడుదల

-

ఇప్పటివరకు ప్రేక్షకులను తనదైన కామెడీతో మేనరిజంతో ఆకట్టుకున్న సీనియర్ నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృద్వీ రాజ్ పర్యవేక్షణలో పృద్విరాజ్ ,క్రాంతి కృష్ణ, శ్రీలు, విజయ రంగరాజు, అశోక్ కుమార్, గీతాసింగ్, కృష్ణ తేజ, అంబటి శ్రీను, జబర్దస్త్ నవీన్, జబర్దస్త్ గణపతి నటీనటులుగా శ్రీ పిఆర్ క్రియేషన్స్ పతాకంపై పద్మ రేఖ, గుంటక శ్రీనివాస్ రెడ్డి, కుర్రి కృష్ణా రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “కొత్త రంగుల ప్రపంచం” ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా సినిమా టైటిల్ ను మీడియా సమక్షంలో రివీల్ చేయాలని చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా

- Advertisement -

30 ఇయర్స్ ఇండస్ట్రీ పృద్వి మాట్లాడుతూ.. నేను ఎక్కువగా విలన్స్ తోనే ట్రావెల్ అయ్యాను. వారి ద్వారా నటనలో ఎంతో నేర్చుకున్నాను.కొత్త రంగుల ప్రపంచం” సినిమా ద్వారా హీరో, హీరోయిన్లు వస్తున్న  వారిని ప్రేక్షకులు ఆశీర్వదించాలి.కొత్త వారైనా చాలా టాలెంటెడ్ ఆర్టిస్ట్ లు.వీరిద్దరూ బాగా నటించారు.ఈ సినిమా 60% షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా కొత్త రంగుల ప్రపంచం సినిమా టైటిల్ ను రివీల్ చేస్తున్నాము.ఇలాంటి మంచి సినిమాలో నేను దర్శకుడి పాత్రలో నటిస్తున్నాను.ఈ సినిమాకు సంగీత దర్శకుడు అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారు.ఈ సినిమా తర్వాత తను చాలా బిజీగా అవుతారు. ఖర్చుకు వెనకాడకుండా నిర్మిస్తున్న నిర్మాతలకు ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

నటుడు సీనియర్ నటుడు అశోక్ కుమార్ మాట్లాడుతూ.. ప్రొడ్యూసర్లకు నష్టం రాకుండా చక్కటి సినిమా తీయాలని పృద్వి గారు దగ్గరుండి అన్నీ చూసు కుంటున్నాడు. ఈ చిత్ర నిర్మాతలు మంచి కాన్సెప్ట్ ఉన్న సెంటిమెంట్ కథను సెలెక్ట్ చేసుకొని ఓ మంచి సినిమా తీయాలని కంకణం కట్టుకున్నారు.వారికి ఈ సినిమా గొప్ప విజయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

నటుడు కృష్ణ తేజ మాట్లాడుతూ .. ఈ మూవీలో నాకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. ఇందులో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు దర్శకుడు నాతో బాగా చేయించాడు. అలాగే సీనియర్ నటుల మధ్య నేను చేయడం చాలా సంతోషంగా ఉంది అన్నారు.

డిఓపి మాట్లాడుతూ ..ఈ బ్యానర్ నాకు కుటుంబం లాంటిది తండ్రి స్థానంలో పృద్వి గారు, తల్లి స్థానంలో రేఖా గారు ఇలా అందరూ నాకు ఎంతో సపోర్ట్ గా నిలిచారు.ఇలాంటి మంచి సినిమాకు నేను వర్క్ చేసే అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాత లకు ధన్యవాదాలు అన్నారు.

డ్యాన్స్ మాస్టర్ వల్లమ కళాదర్ మాట్లాడుతూ..సీనియర్ నటులతో వర్క్ చేయడం అలా అదృష్టం గా భావిస్తున్నాను .సినిమా క్వాలిటీ గా రావడానికి కోసం వీరంతా ఎంతో కష్టపడ్డారు. నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా ఈ చిత్రం నిర్మించారు. దర్శకుడు అద్భుతమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. హీరో హీరోయిన్లు కొత్తవారైనా చాలా ఎనర్జిటిక్ గా నటించారు అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ సంగీత ఆదిత్య మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను సంగీతం అందిస్తూ ఒక పాట పాడే ఆవకాశం ఇవ్వడం జరిగింది. ఇందులోని పాటలు ప్రేక్షకులను అలరిస్తాయని అన్నారు.

హీరో క్రాంతి కృష్ణ మాట్లాడుతూ.. ఇది నా మొదటి సినిమా నిర్మాతలు న్యూ టాలెంట్ ని ఎంకరేజ్ చేయడం చాలా గ్రేట్. సీనియర్ నటులతో నేను సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు.

హీరోయిన్ శ్రీలు మాట్లాడుతూ .. గౌతమ్ గారు కమల్ గార్లు నాకు ప్రతి సీన్ ఎక్స్ప్లెయిన్  చేయడంతో ఈ సినిమాలో నేను చాలా ఈజీగా నటించగలిగాను. మంచి సినిమాలో చేసే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు నా ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు.

చిత్ర దర్శకుడు మాట్లాడుతూ..  ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ తెలియజేస్తూ సస్పెన్స్ త్రిల్లర్ గా సాగె  చిత్ర మిది. ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది.సీనియర్ నటులు వున్నా కూడా వారంతా నాకు ఫుల్ సపోర్ట్ చేశారు. నిర్మాతలు మంచి కథను సెలెక్ట్ చేసుకొని ఖర్చుకు వెనుకాడకుండా తీసిన ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

నటీనటులు
పృథ్వీరాజ్,  క్రాంతి కృష్ణ (హీరో), శ్రీలు (హీరోయిన్),
విజయ రంగ రాజు, అశోక్ కుమార్, అంబటి శ్రీను, గీతాసింగ్, కృష్ణ తేజ, జబర్దస్త్ నవీన్, జబర్దస్త్ గణపతి

సాంకేతిక నిపుణులు
బ్యానర్ :శ్రీ పి ఆర్ క్రియేషన్స్
నిర్మాత : పద్మ రేఖ, గుంటక శ్రీనివాస్ రెడ్డి,కుర్రి కృష్ణా రెడ్డి
మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీ సంగీత ఆదిత్య
కెమెరామెన్ :Sv శివారెడ్డి
డాన్స్ : వల్లమ కళాధర్
పి.ఆర్.ఓ : సాయి సతీష్, పర్వత నేని రాంబాబు

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Banana | రోజుకో అరటి పండు తింటే ఏమవుతుందో తెలుసా..!

అరటి పండు(Banana) తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది జగమెరిగిన...

Salman Khan | ‘నేను అదో గొప్ప అనుకునేవాడిని’.. యాటిట్యూడ్‌పై సల్మాన్ క్లాస్

బిగ్‌బాస్ 18వ సీజన్‌ను హోస్ట్ చేస్తున్న సల్మాన్ ఖాన్(Salman Khan).. తాజా...