ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకాశ్మీర్లో విధించిన ఆంక్షలు అన్నిటిని తొలగిస్తూ ప్రభుత్వం శుభ వార్త చెప్పింది. ఈ మేరకు సమాచార పౌర సంబంధాల అధికారుల నుంచి ఓ ప్రకటన వెలువడింది. రాష్ట్రంలోని ల్యాండ్ ఫోన్ లను పూర్తిగా వినియోగంలోకి తెచ్చామన్నారు. అత్యంత సున్నితమైన కుప్వారా, హంద్వారా తదితర ప్రాంతాల్లోనూ మొబైల్ ఫోన్ నెట్వర్క్ లను అందుబాటులోకి తెచ్చామని ఓ అధికారి పేర్కొన్నారు.
జమ్మూ కాశ్మీర్లో ప్రశాంత వాతావరణం నెలకొంటే అంశాలను తొలగిస్తామని, ఇటీవల జాతీయ భద్రత సలహాదారు. పేర్కొన్న విషయం విధితమే. ఈ నేపథ్యంలో ఎక్కడ అల్లర్లు జరగకపోవడంతో కర్ఫ్యూను తొలగించిన అధికారులు ఇప్పుడు మొబైల్ ఫోన్ నెట్వర్క్ లను అందుబాటులోకి తెచ్చారు. పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉంది.