విజయ్ 66వ చిత్రంలో జంటగా రష్మిక..

0
95

రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే మొదటి సినిమాతోనే ప్రేక్షకులకు ఎంతో దగ్గరయింది. అంతేకాకుండా తాజాగా పుష్ప సినిమాలో నటించి పాన్ ఇండియా రేంజ్ లో మంచి క్రేజ్ దక్కించుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ తలపతి విజయ్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది.

ఈ సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరెకెక్కబోతుంది. తాజాగా ఈ విషయాన్నిరష్మిక మందన పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం వెల్లడించింది. ఇది ఇలా ఉంటే విజయ్ మొదటి సారి నేరుగా నటిస్తున్న తెలుగు సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.