మహారాష్ట్ర నాందేడ్ లో దారుణ హత్య చోటుచేసుకుంది. ఆ గ్రామానికి చెందిన బిల్డర్ సంజయ్ బియాని అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి దారుణంగా కాల్చి చంపి అక్కడి నుండి పరారయ్యారు. ఈ ఘటన అతని ఇంటి సమీపంలోనే జరగడంతో..సీసీటీవీ లో రికార్డ్ అయింది. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.