కరోనా మహమ్మారిపై భారత్ కటిన చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే ప్రజలందరికి ఉచితంగా వ్యాక్సినేషన్ అందిస్తోంది. కరోనా వాక్సినేషన్ లో భారత్ మరో కొత్త రికార్డ్ సృష్టించింది. టీకాల పంపిణీలో సరికొత్త మైలురాయిని అందుకుంది.
భారత్ లో 180 కోట్ల మంది రెండు డోసుల వ్యాక్సిన్ అందుకున్నారు. దీంతో దేశంలో కరోనా కొత్త వేరియంట్ వచ్చిన భారత్ తట్టుకొని నిలబడుతుందనే ధైర్యం ఉంది. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని 2020 జనవరి 16న ప్రారంభించింది.