ఫ్లాష్: రెండు బైకులు ఢీ..ఒకరు దుర్మరణం

0
97

తెలంగాణాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అంతరాం వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొనడంతో ఒకరు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో జరిగింది. దాంతో అక్కడ ఉన్న స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.