తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కూలీలతో వెళ్తున్న వాహనాన్నిగుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో… ముగ్గురు మహిళా కూలీలు అక్కడిక్కడే మృతి చెందగా… మరో ఏడుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన శాయంపేట గ్రామ సమీపంలో జరిగింది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.