ఉద్యోగం కోసం చూసే వారికీ చక్కని శుభవార్త. ఐసీఎంఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ భారత ప్రభుత్వ రంగ సంస్థ హైదరాబాద్‌లోని క్యాంపస్‌లో పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు.
పూర్తి వివరాలు మీ కోసం
భర్తీ చేయనున్న ఖాళీలు: ప్రోజెక్ట్ సీనియర్ రిసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ జూనియర్ రిసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ మల్టీటాస్కింగ్ స్టాఫ్
అర్హులు: పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటిత ఓపాటు సంబంధిత పనిలో అనుభవం, నెట్ అర్హత తప్పనిసరిగా ఉండాలి.
వయస్సు: 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: రూ. 15,800 నుంచి రూ. 44,450 వరకు చెల్లిస్తారు.
ముఖ్యమైన విషయాలు:
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలను కాన్ఫరెన్స్ హాల్, ఐసీఎమ్‌ఆర్-ఎన్‌ఐఎన్, హైదరాబాద్‌లో నిర్వహిస్తారు. వాక్ ఇన్ ఇంటర్వ్యూను 22-04-2022న నిర్వహించనున్నారు. అభ్యర్థులు సంబంధిత సర్టిఫికేట్లతో నేరుగా హాజరుకావాల్సి ఉంటుంది.