Breaking: విషాదం..సీనియర్ నటుడు మృతి

0
75

టాలీవుడ్ లో విషాదం చేటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు శ్రీ బాలయ్య హైదరాబాద్ యూసఫ్ గూడలోని తన స్వగృహంలో ఈ రోజు ఉదయం కన్నుమూశారు. నేడు ఆయన పుట్టినరోజు.. కానీ ఈరోజు అతను కానరాని లోకానికి పోయి అందరికి మనోవ్యధ దుక్కాన్ని మిగిల్చాడు. గత కొంతకాలంగా అతని వయసు సహకరించక పోవడంతో నటనకు కూడా దూరంగా ఉన్నాడు.

ఆయన కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడుగా, కథా రచయితగా తన ప్రతిభ ఘనపరిచారు. ఈయన 300కిపైగా చిత్రాల్లో నటించి మనందరికీ ఎంతో దగ్గరయ్యారు. మొదటగా ఎత్తుకు పైఎత్తు చిత్రంతో నటుడుగా పరిచయం అయ్యి ప్రేక్షకుల్ని ఎంతో మెప్పించాడు.

ఆయన నిర్మాతగా అమృత ఫిల్మ్స్ సంస్థ ద్వారా చెల్లెలి కాపురం, నేరము – శిక్ష, చుట్టాలున్నారు జాగ్రత్త, ఊరికిచ్చిన మాట లాంటి చిత్రాలు శ్రీ బాలయ్య బాధ్యతలు తీసుకొని నిర్మించాడు. దర్శకుడుగా పసుపు తాడు, నిజం చెబితే నేరమా, పోలీసు అల్లుడు రూపొందించారు. ఉత్తమ కథా రచయితగా ఊరికిచ్చిన మాట చిత్రానికి నంది అవార్డు కూడా అందుకున్నారు.

అంతేకాకుండా చెల్లెలి కాపురం చిత్రానికి నిర్మాతగా నంది అవార్డు పొందారు. శ్రీ బాలయ్య కుమారుడు తులసీరామ్ కూడా కొన్ని చిత్రాల్లో కథానాయకుడిగా నటించారు. ఆయన మరణావార్త తెలియడంతో .. సినీ ప్రముఖులు అంతా నివాళులు అర్పిస్తున్నారు. ఆయన మృతిచెందడంతో సినీ పరిశ్రమలో కోలుకొని దుఃఖం మిగిలిపోయింది.