Home SPECIAL STORIES అలెర్ట్: టీటీడీ సంచలన నిర్ణయం

అలెర్ట్: టీటీడీ సంచలన నిర్ణయం

0
208

సర్వ దర్శనం టికెట్లు తీసుకుని తిరుమల వెళ్లాలని అనుకుంటున్న వారికి  టీటీడీ అలర్ట్ జారీ చేసింది. దేశంలో కరోనా వ్యాప్తి పెరుగుతుండడంతో టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుపతిలోని కౌంటర్లలో ఈరోజు సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు ఏప్రిల్ 12వ తేదీ మంగళవారం నాటికి దర్శన స్లాట్ లభిస్తోంది. మంగళవారం స్లాట్ పూర్తి కాగానే టోకెన్ల జారీ నిలిపివేయడం జరుగుతుంది అని టీటీడీ వెల్లడించింది.

అంతేకాకుండా భక్తుల అధిక రద్దీ కారణంగా బుధవారం నాటి సర్వదర్శనం టోకెన్లు ఒక రోజు ముందు అనగా మంగళవారం మధ్యాహ్నం నుండి తిరుపతిలోని ఆయా కౌంటర్లలో కేటాయించడం జరుగుతుంది. కాగా, ఆది, సోమవారాల్లో దర్శన టోకెన్లు కేటాయించబడవు. భక్తులు ఈ విషయాన్ని గమనించి తదనుగుణంగా తమ తిరుమల యాత్ర ప్రణాళిక రూపొందించుకోగలరని సూచించింది. ఈ నిర్ణయం ప్రజల బాగుండాలనే ఉద్దశ్యం తో  తీసుకున్నట్టు తెలిపింది.