వేళ్ళు విరవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా..!

0
97

మనం తరచు మనకు తెలియకుండానే వేళ్ళు విరుకుంటుంటాము. దాదాపు చాలామంది ఈ పని చేస్తుంటారు. అలాగే వేళ్ళు విరిచినప్పుడు శబ్దం కూడా వస్తుంది. కానీ వేళ్ళు విరవడం అనేక నష్టాలూ చేకూరే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

మనం వేళ్ళను విరిచేటప్పుడు శబ్దం రావడానికి గల కారణం ఏంటంటే..జాయింట్ల మధ్య లో ఉండే ఫ్లూయిడ్ గ్యాస్ వలన వచ్చే బబుల్స్ పగిలిపోయి సౌండ్ వస్తుంది. ఒకసారి వేళ్ళను విరిచాక 15 నుంచి 30 నిమిషాల తర్వాత  మళ్లీ ఫామ్ అవుతుంది.

వేళ్ళను విరుచుకోవడం వల్ల లిక్విడ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఒకవేళ కనుక పూర్తిగా అయిపోతే ఆర్థరైటిస్ సమస్యలు వస్తాయి. స్వెల్లింగ్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఎల్లప్పుడూ  వేళ్లను విరవకూడదు. ఒకవేళ ఆ అలవాటు ఉంటే వెంటనే మానుకోండి.