ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..

0
88

కరోనా వల్ల భారీగా తగ్గిపోయిన ఉద్యోగాల నోటిఫికేషన్స్ మళ్ళి ఊపందుకున్నాయి. ప్రైవేట్ కంపెనీలు సైతం తమ కంపెనీలలో చేర్చుకోవడానికి ముందుకొస్తున్నాయి. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ విభాగానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్‌ తాజాగా నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు: 554

పోస్టుల వివరాలు:  పీడియాట్రిక్స్‌, అనెస్తీషియా, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్‌, ఈఎన్‌టీ, డెర్మటాలజీ, రేడియాలజీ, ఫోరెన్సిక్‌ సైన్స్‌ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

అర్హులు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్‌ పీజీ డిగ్రీ/డిప్లొమా/డీఎన్‌బీ ఉత్తీర్ణులై ఉండాలి. అదే విధంగా ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయ్యి ఉండాలి.

వయస్సు: 2022 జులై 1 నాటికి 42 ఏళ్లు దాటకూడదు.

జీతం: నెలకు రూ.53,500 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: పీజీ డిప్లొమాలో సాధించిన మెరిట్‌ మార్కులు, సర్వీస్‌ వెయిటేజ్‌, ఇతర వివరాల ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.

దరఖాస్తువిధానం: ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేదీ: ఏప్రిల్‌ 12, 2022.