లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల పాలసీలని తీసుకొచ్చి ప్రజలను కొంత ఆదుకుంటుంది. కరోనా సంక్షోభం వల్ల చాలామంది ఇలాంటి పాలసీలకు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం మరో కొత్త పాలసీతో మనముందుకొస్తుంది LIC. ఈ స్కీమ్స్ వలన ఎలాంటి రిస్క్ కూడా ఉండదు.
ప్రత్యేకంగా మహిళలు, ఆడపిల్లల కోసం ఎల్ఐసీ ఈ స్కీమ్ ని తీసుకువస్తుంది. ఈ పాలసీతో లోన్ సౌకర్యం కూడా పొందొచ్చు. ఎలాంటి మెడికల్ పరీక్షలు లేకుండానే ఆరోగ్యవంతులైన మహిళలకు ఈ పాలసీని పొందే మంచి అవకాశం ఇస్తుంది. ఈ పాలసీకి రోజు రూ.29 ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో రూ.4 లక్షల వరకు పొందవచ్చు. ఈ పాలసీ మెచ్యూరిటీ కాల వ్యవధి 10 నుంచి 20 ఏళ్లు ఉంటుంది. అంతేకాకుండా ఈ ప్రీమియాన్ని నెలకి, మూడు నెలలకు ఒకసారి, ఆరు నెలలకు ఒకసారి, వార్షికంగా చెల్లించుకొనే వెసులుబాటు కూడా కల్పిస్తుంది.
ఎల్ఐసీ ఆధార్ శిలా ప్లాన్‌లో ఒకవేళ రోజుకు రూ.29 చొప్పున ఇన్వెస్ట్ చేస్తే ఏడాదికి రూ.10,959 అవుతుంది. ఒకవేళ 20 ఏళ్లకు మీరు పాలసీ తీసుకుంటే ఈ పాలసీలో మీరు చెల్లించిన మొత్తం రూ.2,14,696 అవుతుంది. అప్పుడు మెచ్యూరిటీ సమయంలో రూ.4 లక్షల వరకు చేతికి వస్తాయి.ఈ పాలసీ 8 నుంచి 55 ఏళ్ల మధ్య వయసు కలిగిన మహిళలు, పిల్లలకు మాత్రమే అవకాశం.