మజ్లిస్ పార్టీ కీలక నేత, తెలంగాణ అసెంబ్లీలో పార్టీ నాయకుడు అయిన అక్బరుద్దీన్ దశాబ్ద కాలపు నాటి ఒవైసీ కేసులో నేడు నాంపల్లి స్పెషల్ కోర్టులో ప్రజాప్రతినిధుల తుది తీర్పు వెలువరించింది. 2012లో నిజామాబాద్ నిర్మల్ బహిరంగ సభలో విద్వేష పూరకమైన ప్రసంగాలు చేశారనే అభియోగలపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు అయ్యాయి.
ఈ కేసులో అక్బరుద్దీన్‌ను నిర్దోషిగా తేల్చుతూ తీర్పు వెల్లడించింది. విద్వేషపూరిత ప్రసంగాలు చేసినట్లు సరైన ఆధారాలు చూపించలేకపోవడంతో అక్బరుద్దీన్‌ను నిర్దోషిగా తేలినట్టు కోర్టు తెలిపింది. దేశ సార్వభౌమత్వాన్ని దృష్టిలో ఉంచుకొని వివాదాస్పద వ్యాఖ్యలు భవిష్యత్తులో చేయొద్దని అక్బరుద్దీన్‌ను కోర్టు హెచ్చరించింది.