Breaking: ఏపీలో భారీగా పెరిగిన బస్సు చార్జీలు

0
86

ఏపీలో ప్రయాణికుల చార్జీలను APSRTC భారీగా పెంచి ప్రజలకు షాక్ ఇచ్చింది. డీజిల్ సేవ్ పేరుతో పల్లె వెలుగు బస్సుల్లో రూ.2, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో రూ.5, ఏసీ బస్సుల్లో రూ.10 చొప్పున పెంచుతున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. పెరిగిన టిక్కెట్ల ధరలు రేపటి నుండి అమలులోకి రానున్నాయి. పల్లె వెలుగు బస్సుల్లో కనీస టిక్కెట్ ధర రూ.10 అని చెప్పారు. దాంతో పెరిగిన బస్సు చార్జీలతో ప్రజలు ప్రయాణం చేయాలంటే జంకుతారేమో.