ఏపీలో రైతులు, కౌలు రైతులు పంట నష్టాలు, అప్పుల భారంతో ఆత్మహత్యలు చేసుకోవడంతో చనిపోయిన కౌలు రైతు కుటుంబాలను పరామర్శించి..ఆర్థిక సహాయం చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఏపీలో బుధవారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో యూనిట్ 4 లో గ్యాస్ లీకై మంటలు చెలరేగి రియాక్టర్ పేలిపోవడంతో ఆరుగురు మృతి చెందడంతో పాటు 13 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసాడు.
మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆయన వెల్లడించారు. LG పాలిమర్స్ దుర్ఘటనలో ఇచ్చిన విధంగానే ఇప్పుడు కూడా చనిపోయిన వారికి రూ. కోటి ఇచ్చి భరోసా కల్పించాలని తెలిపారు. అందరికి ఒకే విధమైన నష్ట పరిహారం చెల్లించాలని ఆయన తెలిపారు. అంతేకాకుండా గాయపడిన 13 మందికి మెరుగైన వైద్యం కూడా అందించాలని చెప్పారు.