ఛాయ్ లో బిస్కెట్స్ ముంచుకొని తినే అలవాటు ఉందా? తస్మాత్ జాగ్రత్త..

0
114

ఈ మధ్యకాలంలో చిన్నపెద్ద అని తేడా లేకుండా ఛాయ్ లో బిస్కెట్లు ముంచుకుని తినడం అందరు అలవాటు చేసుకుంటున్నారు. సాధారణంగా చిన్న పిల్లలు ఇలా తినడానికి అధికంగా ఇష్టపడతారు.  కానీ ఇలా తింటే ఏ సమస్యలు ఎదురవుతాయో మీరే చూడండి. దీనిని చూస్తే ఇంకోసారి మీ జీవితంలో మళ్ళి ఛాయ్ జోలికి కూడా పోరు.

టీతో పాటు బిస్కెట్లుని ముంచుకుని తీసుకోవడం మంచిది కాదని..దీని వల్ల ప్రమాదకరమైన సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం తీసుకునే బిస్కెట్లలో హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల బరువు కూడాపెరిగే అవకాశం ఉందంటున్నారు. అంతేకాకుండా షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి.

ఫైబర్ ఇందులో ఉండకపోవడం వల్ల కాన్స్టిపేషన్ సమస్య కూడా కలిగే అవకాశాలు ఎక్కువే అని నిపుణులు చెబుతున్నారు. సోడియం లెవెల్స్ కూడా పెరిగిపోతాయి. అందుకే థైరాయిడ్ పేషెంట్లు డయాబెటిస్ తో బాధపడే వాళ్ళు వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అందుకే ఎవ్వరికైనా ఈ అలవాటు ఉంటే వెంటనే మానుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.