Flash: దైవ దర్శనానికి వెళ్తున్నకుటుంబంలో విషాదం

0
110

రాజస్థాన్ జోధ్​పుర్​లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారులో దైవదర్శనానికి వెళ్తుండగా బొలెరో, ట్రక్కు ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జోధ్ పుర్-జైపూర్ జాతీయ రహదారి వద్ద బిలాడా సమీపంలో జరిగింది. పోలీసులకు సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చెప్పట్టారు. ఇంకా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.