చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటి, నిర్మాత టెలివిజన్ వ్యాఖ్యాత మంజూసింగ్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ..ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగా క్షీణించడంతో మృతి చెందినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమెకు 74 సంవత్సరాలు ఉన్నాయి. 80వ దశకంలో టెలివిజన్ తో పాటు సినిమా రంగంలో కూడా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె మృతి చెందడంతో చిత్ర పరిశ్రమలో అందరు కన్నీరు మున్నీరు చేసుకున్నారు.