రైతులకు శుభవార్త..ఎరువులపై సర్కార్ కీలక ప్రకటన

0
66

రైతులకు చక్కని శుభవార్త చెప్పాడు వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి. డీఏపీ, కాంప్లెక్సు ఎరువుల వల్లే ప్రజలకు మంచి రాబడి వస్తుందనే ఉద్దేశ్యంతో..సర్కార్ ఈ విషయంలో కీలక ప్రకటన చేసారు. రైతుల పంట పండించడం వల్లే నేడు కడుపునిండా అన్నం తినగలుగుతున్నాం అందుకు రైతులకు ఏదైనా మంచి చేయాలనే ఆకాంక్షతో మంత్రి నిరంజన్ రెడ్డి ఈ శుభవార్త చెప్పాడు.

హైదరాబాద్ మంత్రుల నివాస స్థలంలో వానాకాలం ఎరువుల సరఫరాపై సమీక్ష నిర్వహించడంతో   మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ ప్రజలకు అవసరమైన డీఏపీ, కాంప్లెక్సు ఎరువులు జూన్ 15 నాటికి సిద్దం చేయాలని  మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

వానాకాలానికి 24.45 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల కేటాయించామని మంత్రి తెలిపారు. 10.5 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా, 9.4 లక్షల మెట్రిక్ టన్నులు కాంప్లెక్సు ఎరువులు, 2.3 లక్షల మెట్రిక్ టన్నులు డీఎపీ, 2.25 లక్షల మెట్రిక్ టన్నులు ఎంఓపీ మరియు ఎస్ఎస్పీ రైతుల కోసం సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.