ఫ్లాష్: టాలీవుడ్ లో మరో విషాదం..

0
86

టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. వరుస విషాదాలతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కంటతడి కూడా  ఆరనివ్వడం లేదు. తాజాగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు నారాయణదాస్ నారంగ్  కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండంతో ఆసుపత్రికి తరలించారు. దాంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విరిచాడు. చిత్రపరిశ్రమలో ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, మూవీ ఫైనాన్సియర్ గా అమితమైన సేవలు అందించాడు. ఏషియన్ ఫిల్మ్స్, ఏషియన్ ధియేటర్స్ గ్రూప్ అధినేతగా వ్యవరించాడు. కొన్ని సినిమాలలో నిర్మాతగా కూడా బాధ్యతలు తీసుకొని చేపట్టాడు. ఈయన మరణవార్త తెలిసిన ప్రముఖులు ద్రిగ్బంతి వ్యక్తం చేస్తున్నారు.