ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిధిగా గబ్బర్ సింగ్

0
109

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న భారీ చిత్రం ఆచార్య. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, రామ్ ​చరణ్ జతగా పూజాహెగ్డే నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఏప్రిల్ 14న ట్రైలర్ థియేటర్స్ లో విడుదలై ప్రేక్షకులను ఆనందపరిచింది. ఈ సినిమా ఏప్రిల్‌ 29 వ తేదీన విడుదల కానుంది.

అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఫంక్షన్‌కు ముఖ్య అతిధిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విచ్చేయనున్నట్టు చిత్ర బృందం తెలియజేసింది. సీఎం జగన్ వస్తారని భావించి ఈ నెల 23 వ తేదీన విజయవాడలో సిద్దార్థ కాలేజీలో జరగనున్నట్టు తెలిపారు. కానీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ కు సీఎం నిరాకరించడంతో చిత్రబృందం వేదికను మార్చింది.

హైదరాబాద్ లో అదే రోజున యూసఫ్‌ గూడలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌ లో నిర్వహించింది. ఈ మేరకు ఆచార్య చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసింది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ సందర్బంగా ఒకే వేదికపై మెగాస్టార్, పవర్ స్టార్ మరియు మెగా పవర్ స్టార్ సందడి చేయనున్న నేపథ్యంలో ప్రేక్షకులకు కన్నుల పండగే.