Flash: విషాదం..రోడ్డు ప్రమాదంలో మాజీ ఎంపీపీ మృతి

0
84

ఏపీకి చెందిన తెదేపా సీనియర్​ నేత విష్ణువర్ధన్‌రెడ్డి కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కర్నూలు మాజీ ఎంపీపీ గా అతని కుమారుడు రాజవర్ధన్ రెడ్డి వ్యవరించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళ్తుండగా ఒక్కసారిగా రెండు టైర్లు పేలి ఈ ప్రమాదం జరిగింది.

దాంతో అక్కడ ఉన్న స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా..వైద్యుల సమక్షంలో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం ఇటిక్యాల పాడు గ్రామ శివారు లోని జాతీయ రహదారిపై ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈయన మరణ వార్తను తెలుసుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.